5 year old child become a police officer in ujjaini because his father death | Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా

Child Constable Viral News: సాధారణంగా పోలీస్ కావాలంటే ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలి, అందులో ఉత్తీర్ణత సాధించాలి, ఆ తర్వాత కండక్ట్ చేసే ఈవెంట్స్ లో పాల్గొనాలి. అందులోనూ సక్సెస్ అయితే అప్పుడు వారికి పోలీస్ ట్రైనింగ్ ఇచ్చి, పోస్టింగ్ ఇస్తారు. ఇది పోలీస్ కావాలంటే జరగాల్సిన ప్రాసెస్. కానీ ఓ పిల్లాడు ఐదేళ్ళకే పోలీస్ అయ్యాడు. ఇది సినిమా స్టోరీ కాదు. రియల్ స్టోరీ. ఇంతకుముందు చాలా మంది చిన్నారులు ఆఖరి కోరిక పేరుతో పోలీస్ కావడం చూసే ఉంటారు. కానీ అది ఒక్క రోజుకే. కానీ ఈ బాలుడు పర్మనెంట్ అపాయింట్మెంట్ పొందాడు. అయితే మరి అంత చిన్న వయసులో ఎలా పోలీస్ అయ్యాడు. అసలేం జరిగింది, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఐదేళ్ల బాలుడికి అధికారులు పోలీస్ నియామక పత్రం అందించారు. దీంతో ఇప్పుడు ఈ బాలుణ్ణి అందరూ బాల కానిస్టేబుల్ అంటున్నారు. అతని తండ్రి స్థానంలో బాలునికి నియామకం చేయనున్నారు. అయితే అందుకు ఓ కండిషన్ ఉంది. ఈ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిందేనని అధికారులు తెలిపారు.

ఉజ్జయినిలో పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ తన ఒడిలో చైల్డ్ కానిస్టేబుల్ కూర్చుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ బాల కానిస్టేబుల్ తన తండ్రి చనిపోయాక అతని స్థానంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తాడు.అయితే, ఇప్పుడు 5 ఏళ్ల బాలుడు పోలీస్ శాఖలో చేరాలంటే 18 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?

లవకేష్ బిసారియా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. అతని ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో అతని స్థానంలో, అతని కుమారుడు దేవిక్ విసరియాకు ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడంతోపాటు, పోలీసు సూపరింటెండెంట్ కూడా దైవిక్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపించారు.

ఫోర్స్ కానిస్టేబుల్‌గా అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దైవిక్‌కి 18 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూపులు తప్పవని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. 18 ఏళ్లు నిండి, హయ్యర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే, అతనికి కానిస్టేబుల్ ఉద్యోగానికి అవకాశం లభిస్తుందన్నారు. బాల కానిస్టేబుల్ తండ్రి ఉజ్జయిని జిల్లాలోని ఝరా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించాడు. ఈ సందర్భంగా పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. లోకేశ్ చాలా ధైర్యసాహసాలు కలిగిన పోలీసు అని, ఆయన పదవీ కాలంలో ఎన్నో విజయాలు సాధించారన్నారు.

పోలీసు శాఖ ఇప్పటికే ఫోర్స్ కానిస్టేబుల్‌కు అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చి అతనిని తన విభాగంలో భాగం చేసింది. అయితే, ఉద్యోగం 18 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ విషయంపై పోలీస్ సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా నియమితులైన వారికి శిక్షణ ఇస్తున్న విధంగానే చైల్డ్ కానిస్టేబుల్‌కు శిక్షణ ఇవ్వాలన్నారు. చైల్డ్ కానిస్టేబుళ్ల పూర్తి డేటాను అధికారుల వద్ద ఉంచడంతోపాటు వారి విద్యను కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని, తద్వారా చైల్డ్ కానిస్టేబుళ్లు 18 ఏళ్లు నిండిన తర్వాత విద్యను పూర్తి చేసి పోలీసు శాఖలో సేవలందించవచ్చని తెలిపారు.

మరిన్ని చూడండి

Source link