యశస్వి, రోహిత్.. 17 ఏళ్ల రికార్డు బ్రేక్
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి వికెట్ కు యశస్వి, రోహిత్ 229 పరుగులు జోడించారు. వెస్టిండీస్ పై టెస్టుల్లో తొలి వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 2006లో సెహ్వాగ్, వసీం జాఫర్ కలిసి నెలకొల్పిన 159 పరుగుల రికార్డు బ్రేకయింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 103 పరుగులు చేసి ఔటయ్యాడు.