ప్రతి ఇంట్లో ఫ్రీగా 7 రకాల వైద్య పరీక్షలు, సెప్టెంబర్ 30న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం-amaravati cm jagan review on jagananna arogya suraksha program starts on september 30th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నాలుగు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం

తొలిదశలో వలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయబోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు, పథకాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆ ఏరియా వాలంటీర్లతో కలిసి వెళ్లి 7 రకాల టెస్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరిస్తారు. రెండో టీం ఆశావర్కర్, ఏఎన్‌ఎంతో సీహెచ్‌ఓ వస్తారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది. 7 రకాల టెస్టులు చేసే విధంగా.. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్‌ టెస్టుతో పాటు (ఉమ్మి) స్పూటమ్‌ టెస్ట్, మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొబైల్‌ యాప్‌లో ఇలా సేకరించిన డేటాను అప్‌డేట్‌ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేస్ షీట్‌ కూడా జనరేట్‌ అవుతుంది. ఫేజ్‌-3లో మరోసారి ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది. హెల్త్‌ క్యాంప్‌ జరగబోయే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్, ఏఎన్‌ఎం, ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారు. ఫేజ్‌ 4లో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్‌ క్యాంపు ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. రూరల్, అర్బన్‌ ఏరియాలోనూ ఈ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారు.

Source link