కుల ప్రాతిపదికన భూకేటాయింపులా..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు-telangana high court key comments about caste wise land allocations

TS HC On Caste Wise Land Allocations: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సవాల్ చేసూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ రెండు కులాలకు భూ ములు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం.

Source link