RP Chepala Pulusu in Anantapur అనంతపూర్‌లో ఆర్పీ చేపల పులుసు


Sun 18th Jun 2023 06:33 PM

kirrak rp,nellore,pedda reddy,chepala pulusu,curry point,anantapur,  అనంతపూర్‌లో ఆర్పీ చేపల పులుసు


RP Chepala Pulusu in Anantapur అనంతపూర్‌లో ఆర్పీ చేపల పులుసు

కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికొచ్చేశాక జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డిలపై ఎన్నో ఆరోపణలు చేశాడు. అక్కడ ఫుడ్ బాగోదు, జబర్దస్త్ నుండి బయటికి వస్తే ఎదగనివ్వరంటూ కామెంట్స్ చేశాడు. అలాగే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగోకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిల్లిగవ్వ సహాయం చెయ్యలేదు అన్నాడు. అయితే ఆ తర్వాత ఆర్పీ జీ ఛానల్, స్టార్ మా లో కామెడీ చేసి సినిమా నిర్మాతగా మారదామనుకుని ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కూకట్ పల్లి ఏరియాలో ఆర్పీ చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్ పెట్టి తెగ ఫేమస్ అయ్యాడు.

యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఆర్పీ చేపల పులుసుని తెగ ప్రమోట్ చేశాయి. కూకట్ పల్లిలో చేపల పులుసు సక్సెస్ అవడంతో మణికొండ, SR నగర్ లలో మరికొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. అక్కడికి జబర్దస్త్ బ్యాచ్‌ని ఆహ్వానించి హడావిడి చేశాడు. అయితే SR నగర్ బ్రాంచ్ తర్వాత ఆర్పీ హడావిడి యూట్యూబ్ ఛానల్స్‌లో కనిపించలేదు. పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో ఉన్నాడు. అతని కిడ్నీ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు భరిస్తా అన్నాడు.. మళ్ళీ మాట్లాడడం లేదు.

అయితే తాజాగా ఆర్పీ ఓ యూట్యూబ్ ఛానల్‌లో దర్శనమిచ్చాడు. అది అనంతపూర్‌లో ఆర్పీ చేపల పులుసు హోమ్ టూర్ అంటూ మళ్ళీ హడావిడి మొదలు పెట్టాడు. చేపలు కడిగి, కూర వండినదంతా యూట్యూబ్ ఛానల్స్ వారికి చూపిస్తూ చేపల పులుసు ఎలా వండాలో చెప్పుకొచ్చాడు. కొన్నాళ్లుగా కనబడని ఆర్పీ.. ఇన్నాళ్ళకి అనంతపూర్ చేపలపులుసు హోమ్ టూర్ ద్వారా కనిపించడంతో ఆయన ఫాన్స్ ఆనందపడుతున్నారు.


RP Chepala Pulusu in Anantapur:

Kirrak RP Starts Nellore Pedda Reddy Chepala Pulusu Curry Point at Anantapur





Source link