వైసీపీ క్రిమినల్ కోటలు బద్దలు కొడుతామన్న పవన్ కళ్యాణ్-jana sena president pawan kalyan has announced that he will break the ycp criminal gangs

వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవచ్చని, ఇప్పటికే బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని కాకినాడలో పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నామని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తోందని మండిపడ్డారు.

Source link