ఏపీ ఆర్జీయూకేటీ నోటిఫికేషన్
ఏపీ ఆర్జీయూకేటీ(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. జూన్ 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 13వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల కానుంది. ఇక ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని అధికారులు తెలిపారు. సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. https://www.rgukt.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది