హంతకుడు ఎవరు?
పోలీసులు ఈ హత్యపై ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మల్లేష్ ను హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యను వదిలేసిన మల్లేష్ ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మల్లేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మల్లేష్ కు ఎవరితోనైనా విబేధాలు ఉన్నాయా? వారే మల్లేష్ ను హత మార్చారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత హత్య కేసు వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.