Bigg Boss 7 Promo is here బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది


Tue 11th Jul 2023 10:07 AM

bigg boss  బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది


Bigg Boss 7 Promo is here బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది

బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ హడావుడి చేసే ఆడియన్స్ కి దానిపై గత రెండు మూడు సీజన్స్ నుండి ఇంట్రెస్ట్ తగ్గింది అనే చెప్పాలి. లేదంటే బిగ్ బాస్ సీజన్ 5 కి సీజన్ 6 కి చాలా తక్కువ టీఆర్పీ వచ్చేవి కావు. వీకెండ్ లో నాగార్జున ఎపిసోడ్స్ కి కూడా టీఆర్పీ బాగా తగ్గిపోయింది. ఇక గత సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. కానీ అతను అంతగా ఎక్కడ హైలెట్ అయ్యింది లేదు. శ్రీహన్ విన్నర్ కావల్సింది.. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి రేవంత్ విన్నర్ అయ్యాడు.

అయితే సీజన్ 7 కి స్టార్ట్ అవడానికి సమయం దగ్గరపడుతోంది. సెప్టెంబర్ లో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది. కాకపోతే ఈ ఏడాది కాస్త ముందుగానే అంటే ఆగష్టు లోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యే ఛాన్సెస్ ఉండడంతోనే మేకర్స్ అప్పుడే ఇలా ప్రోమో వదిలారంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కి రాబోయే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తున్న మేకర్స్.. తాజాగా ప్రోమో ఇచ్చారు. సీజన్ 7 లోగో మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7 కమింగ్ సూన్ అంటూ ఆ ప్రోమోలో ఉంది.

అయితే ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ స్థానం నుండి తప్పుకుంటున్నారు ఆ ప్లేస్ లోకి రానా కానీ బాలయ్య కానీ వచ్చే ఛాన్స్ ఉంది అనే టాక్ ఉన్నప్పటికీ .. ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా రాబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం అందుతుంది.


Bigg Boss 7 Promo is here:

Bigg Boss Telugu 7 Promo is here





Source link