కొత్త మండపం నిర్మించడానికే
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు వస్తుంటారు. భక్తి, శ్రద్ధలతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, ప్రత్యే పూజలు చేస్తారు. కాలినడక లేదా క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు భక్తులు. తిరుమల కొండపై ప్రధాన దేవాలయం చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటైన రాయల కాలం నాటి రాతి మండపాన్ని కూల్చివేశారు టీటీడీ అధికారులు. మండపం కూల్చివేతపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి నూతన మండపం నిర్మించేందుకు దీన్ని కూల్చివేశామని అధికారులు తెలిపారు. పార్వేట మండపం వెయ్యేళ్ల నాటిదని భక్తులు అంటున్నారు. తిరుమల నుంచి పాపనాశనానికి వెళ్లే మార్గంలో ఈ రాతి మండపం ఉంది. ఇందులో పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి ఉత్సవాలు నిర్వహించేది టీటీడీ. అయితే ఈ పై భాగాన్ని పూర్తిగా తొలగించారు. దీని స్థానంలో ఆకర్షణీయమైన నూతన మండపాన్ని నిర్శించనున్నట్లు టీటీడీ తెలిపింది.