కోమటిరెడ్డి ఏమన్నారంటే?
మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఖండించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో అన్నారో తెలియదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ ఇచ్చే బాధ్యత తమదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 గంటలు కూడా విద్యుత్ ఇవ్వట్లేదని, తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీలో నిర్ణయం తీసుకోలేరని, అంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారన్నారు.