సినీ రంగంలోకి వారికి టికెట్లు
చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్ర విభజన సినీ పరిశ్రమ సమస్యలు ఎక్కువయ్యాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ముందుకురాలేదని ఆరోపిస్తున్నారు. సినీ పరిశ్రమకు నంది అవార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదంటున్నారు. సినిమా ఈవెంట్స్ కు హాజరవ్వటం తప్ప పరిశ్రమను మరింత వేగంగా ముందుకు వెళ్లేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో పరిశ్రమకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చామని, అండగా నిలిచామని కాంగ్రెస్ అంటోంది. ఈసారి సినీ పరిశ్రమలో రాజకీయంగా ఆసక్తి ఉన్న వారిని టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. టికెట్ల కేటాయింపుతో పాటు మంత్రివర్గంలోనూ స్థానం ఇవ్వాలని నిర్ణయించింది. సినీ కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.