Revanth Reddy :కాంగ్రెస్ దీక్షను నిరుగార్చాలనే కుట్ర, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని మళ్లీ రుజువైంది- రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ఆందోళనలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్ మూడు గంటలు చాలన్న రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మరోసారి రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.

Source link