ByKranthi
Tue 11th Jul 2023 11:35 AM
కొన్ని రోజులుగా హీరోయిన్ పూజా హెగ్డేపై ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో.. సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి ఇట్టే తెలిసిపోతుంది. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న హీరోయిన్‌కి ఎటువంటి అవమానాలు అయితే జరుగుతాయో.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌లో ఉన్న పూజా హెగ్డేకి కూడా అంతే స్థాయిలో జరిగిన అవమానం ‘గుంటూరు కారం’ నుంచి ఆమెను తీసేయడం. దాదాపు 10 రోజుల పాటు ఆమెపై షూట్ చేసిన తర్వాత.. ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్లుగా రీసెంట్‌గా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆమెని ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయడానికి కారణాలు కూడా అనేకం వినబడుతున్నాయి. ఒకసారి హీరోగారు ఇష్టపడటం లేదని, ఇంకోసారి ప్రాజెక్ట్ డిలే కావడం వల్ల.. పూజా వేరే ప్రాజెక్ట్‌కి ఇచ్చిన కమిట్‌మెంట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని.. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అంతరార్థం మాత్రం ఆమెకు హిట్ లేకపోవడమే అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆమెను హీరోయిన్‌గా తీసేసిన సినిమాలోనే పూజా.. ఇప్పుడు ఐటం సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్ మొదలైంది.
అవును.. ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయబోతుందట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. అఫీషియల్‌గా అయితే సమాచారం రాలేదు కానీ.. ఈ సినిమాలో ఐటం సాంగ్‌లో చేసేందుకు పూజా హెగ్డే ఓకే చెప్పిందనేలా ఓ గాసిప్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అంతే.. ఇంకేముంది.. పూజాపై ఓ రేంజ్‌లో వార్తలు మొదలయ్యాయి. పూజా హెగ్డే రేంజ్ పడిపోయిందంటూ.. చివరికి ఇది పూజా పరిస్థితి అంటూ టాక్ మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ప్రస్తుతం ఆమె చేతిలో టాలీవుడ్‌కి సంబంధించి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకపోవడమే ఇలాంటి వార్తలకు కారణం అవుతోంది.
Pooja Hegde in Guntur Kaaram Item Song:
Pooja Hegde Got One More Chance in Mahesh Guntur Kaaram