TSRTC : గుడ్ న్యూస్… గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి TSRTC ప్రత్యేక బస్సు

షెడ్యూల్ ఇదే:

సర్వీసు నంబరు 92221 గల ఈ ప్రత్యేక బస్సు.. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ నుంచి గానుగాపూర్‌కు బయలుదేరుతుంది. 17న దత్తాత్రేయ స్వామి దర్శనానంతం.. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పండరీపూర్‌ చేరుకుంటుంది. అక్కడ పాండురంగస్వామి దర్శనం పూర్తవగానే రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌కు వెళ్తుంది. తుల్జా భవాని మాత దర్శనానంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుంది. గానుగుపూర్‌ ప్రత్యేక బస్సు టికెట్‌ ధర రూ.2,500గా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరలో ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజన, వసతి సదుపాయాల బాధ్యత భక్తులదే.

Source link