భారీ మెజార్టీ….
రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోసిద్దిపేట నియోజకవర్గం నుంచి 93, 328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు హరీశ్ రావ్. తొలి మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఓ దశలో ఆయన్ను కాళేశ్వరరావుగా అభివర్ణించారు.ఇదే తరహా కామెంట్స్… నాటి గవర్నర్ నరసింహన్ కూడా చేశారు. మరోవైపు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విక్టరీ కొట్టారు హరీశ్ రావ్. ఇదే దేశంలోనే అత్యధిక మెజార్టీగా ఉంది. మరోసారి కూడా కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఈటల రాజేందర్ పార్టీ మార్పు తర్వాత…. వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీశ్ రావే చూస్తున్నారు.