Jharkhand Student Kills Herself After Teacher Slaps Her For Wearing ‘Bindi’, Accused Arrested

Jharkhand Student Sucide: 

ఝార్ఖండ్‌లో ఘటన..
 
ఝార్ఖండ్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. టీచర్ చెంపదెబ్బ కొట్టిందన్న అవమానంతో ప్రాణాలు తీసుకుంది. బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు టీచర్‌ విద్యార్థినిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి నుంచి సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. టీచర్ టార్చర్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో రాసింది విద్యార్థిని. 

“ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. ఆమె దగ్గర ఓ సూసైడ్‌ నోట్‌ని స్వాధీనం చేసుకున్నాం. స్కూల్‌లో టీచర్‌ వేధించడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసింది. ఈ నోట్ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశాం. తదుపరి విచారణ కొనసాగిస్తాం”

– పోలీసులు

 

Source link