Prabhas in silent mode సైలెంట్ మోడ్ లో ప్రభాస్


Wed 12th Jul 2023 11:25 AM

prabhas  సైలెంట్ మోడ్ లో ప్రభాస్


Prabhas in silent mode సైలెంట్ మోడ్ లో ప్రభాస్

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగినప్పుడు ఆదిపురుష్ ని ప్రమోట్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ కనిపించని లేదు. ఆదిపురుష్ డిసాస్టర్ అవడం, సలార్ టీజర్ రిలీజ్ అయినా ప్రభాస్ నుండి ఎలాంటి స్పందన లేదు. ఆదిపురుష్ విడుదలకు ముందే ప్రభాస్ అమెరికా వెళ్ళినట్లుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ ఎక్కడా కనిపించిన సందర్భం లేదు. సలార్ టీజర్ రిలీజ్ అయ్యింది. అటు ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మధ్యలో కమల్ ఎంట్రీ అప్పుడు కమల్ తో పని చేసేందుకు ఎగ్జైట్ అవుతున్నట్టుగా పెట్టిన ట్వీట్ తప్ప ఇప్పటివరకు ప్రభాస్ సైలెంట్ గా ఉన్నాడు.

తాజాగా మారుతి మూవీ షూట్ లో కూడా ప్రభాస్ పాల్గొనడం లేదు అని.. ప్రభాస్ లేకుండానే మారుతి మిగతా నటులపై సన్నివేశాల చిత్రీకరణతో బిజీగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో అప్పుడప్పుడు లీకులు ఇచ్చిన మారుతి ఇప్పుడు కామ్ గా సీక్రెట్ గానే ప్రభాస్ తో చేస్తున మూవీ షూటింగ్ చక్కబెడుతున్నాడంటున్నారు. ఇక ప్రభాస్ ఫైనల్ గా జులై 20 న ప్రాజెక్ట్ K ట్రైలర్, టైటిల్ ఎనౌన్సమెంట్ రోజునే బయటికి వస్తాడని తెలుస్తుంది. అప్పటివరకు ప్రభాస్ సైలెంట్ మోడ్ లోనే ఉంటాడని అంటున్నారు. 

ప్రభాస్ ఇంత కామ్ గా ఉండడంతో ఫాన్స్ కూడా తెగ ఫీలవుతున్నారు. ఇక సలార్ తో ప్రభాస్ సెప్టెంబర్ 28న హిట్ కొట్టడం పక్కా అని ప్రభాస్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో కలసి ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ ని ఆగష్టు చివరివారం నుండి ప్రారంభించబోతున్నాడని చిత్ర బృందం చెబుతున్న మాట.


Prabhas in silent mode :

Prabhas fans are frustrated with the silence 





Source link