Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ, సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు. వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కు ఎక్కువ అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చాలా చోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, ఈ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని మండిపడ్డారు. సీఎం జగన్ సతీమణిని జనసేన ఎప్పుడూ వివాదాల్లోకి లాగలేదన్నారు. సీఎం జగన్‌ను తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. జగన్ సంస్కారం లేదని, ఆయనకు సీఎంగా అంటే అర్హత లేదన్నారు. ఏపీ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలో దొరుకుతుందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదన్న పవన్… వ్యవస్థ పనితీరు గురించే ప్రశ్నిస్తున్నానన్నారు. కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవంకాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని విమర్శించారు.