ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ విదానపరమైన నిర్ణయాల్లో భాగంగా రాజధానిని రాష్ట్రంలోని మూడుప్రాంతాలకు విస్తరించాలని భావించింది. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటం వల్ల లాబం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. రాయలసీమ, ఆంధ్రా,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించాలని ఆ పార్టీ భావించింది. అమరావతిలో శాసన రాజధాని మాత్రమే కొనసాగించి, రాయలసీమకు న్యాయ రాజధాని, విశాఖపట్నంకు పరిపాలనా రాజధాని తరలించాలని అసెంబ్లీ ప్రకటించారు.