మరో విడతలో మరికొందరికి….
ఈ స్కీమ్ కు 5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా…. తొలి విడతలో మాత్రం 5950 మందికి మాత్రమే లక్ష రూపాయల సాయం అందించనున్నారు. మరికొన్ని విడతల్లో అర్హులైన వానిరి ఎంపిక చేస్తారు. ఇదే విషయంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. విడతల వారీగా ప్రతి నెల 15వ తేదీన చెక్కులను అందజేస్తామని పేర్కొంది. ప్రతి నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారు. దరఖాస్తు ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని…. ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.