ByKranthi
Thu 13th Jul 2023 04:21 PM
కమెడియన్‌గా సినిమాలలో చేస్తూనే స్టార్ హీరోల సరసన ఫ్రెండ్ క్యారెక్టర్స్‌తో ఫేమస్ అయ్యి.. తర్వాత బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో లో టీమ్ లీడర్‌గా కామెడీతో హైలెట్ అయిన వేణు.. ఆ తర్వాత చాలా ఏళ్ల గ్యాప్‌తో వెండితెర మీద దర్శకుడిగా లాంచ్ అయ్యాడు. దిల్ రాజు వంటి పేరున్న నిర్మాత బ్యానర్‌లో తెలంగాణ నేపథ్యంలో బలగం అనే చిన్న సినిమాతో అందరిచూపు తనవైపే తిప్పుకున్నాడు. బలగంతో ఎన్నో అవార్డ్స్ కొల్లగొట్టిన వేణు తర్వాత చక్కగా వెకేషన్స్‌ని ఎంజాయ్ చేసి వచ్చాడు.
ఇటీవలే వేణు తన తదుపరి మూవీ కోసం స్టోరీని మొదలు పెట్టినట్లుగా అప్‌డేట్ కూడా ఇచ్చాడు. అయితే తన నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే చేయబోతున్నాడు వేణు. తన నెక్స్ట్ హీరోపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేసినట్టుగా వేణు చెప్పాడు. అయితే వేణు తన తదుపరి మూవీకి దర్శకుడిగా భారీగా డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాకుండా తనకి అన్ని విషయాల్లో పూర్తి ఫ్రీడమ్ కావాలంటూ పట్టుబడుతున్నాడట.
బలగం లాంటి హిట్ ఉన్న దర్శకుడు కదా ఆయనేం చెబితే అదే జరగాలని పట్టుబడుతున్నాడంటూ అతనిపై వార్తలు మొదలయ్యాయి. రెండో సినిమాకే వేణుకు కొమ్ములొచ్చాయంటూ అతనిపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రూమర్స్ మొదలయ్యాయి. మరి ఈ రూమర్స్ వేణు ఎలా స్పందిస్తాడో చూడాలి?
Rumours on Balagam Movie Fame Venu Yeldandi:
Venu Yeldandi Demands High Remureration for Second Project