AP EAP Cet 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా కౌన్సిలింగ్ మాటెత్తడం లేదు. షెడ్యూల్ వెల్లడించడానికి నిర్దిష్ట కారణాలు ఏమిటనేది కూడా అధికారులు చెప్పడం లేదు.