మరోవైపు హాస్టల్లో హత్యకు గురైన విద్యార్ధికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల పరిహారం అందచేసింది. పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్, వాచ్‌మాన్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్ధుల్ని ఒంటరిగా వదిలేసి సిబ్బంది వెళ్లిపోవడంతోనే ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లలు ఏకంగా హత్యలు చేసే స్థాయికి వెళ్లారు.