TSPSC group 2 Exam:గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే గ్రూప్ – 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా…. గ్రూప్ – 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీగా సెంటర్లను ఎంపిక చేసే పనిలో ఉంది. మరోవైపు పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలను కేటాయిస్తున్న క్రమంలో… తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.