Chandrayaan 3 Launched:
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు. చంద్రయాన్ 3 ప్రతి భారతీయుడి కలల్ని, ఆకాంక్షల్ని మోసుకెళ్లిందని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం అని కొనియాడారు.
“భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్ 3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్”
– ప్రధాని నరేంద్ర మోదీ
Chandrayaan-3 scripts a new chapter in India’s space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists’ relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రయోగంపై స్పందించారు. చంద్రయాన్ 3 ని ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Union Home Minister Amit Shah tweets, “India today embarked on its historic space journey with the successful launch of Chandrayaan-3. My heartfelt congratulations to the ISRO scientists whose tireless pursuit has today propelled India on the path of scripting a remarkable space… pic.twitter.com/xWKrCVSjSG
— ANI (@ANI) July 14, 2023
అంతకు ముందు పారిస్‌లో అడుగు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి.. ఫ్రాన్స్ ప్రధాని బోర్న్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఫ్రెంచ్ రాజధానిలోని లా సీన్ మ్యూజికేల్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. “భారత్, ఫ్రాన్స్ మధ్య విడదీయరాని స్నేహం” గురించి ప్రస్తావించారు. తాను చాలాసార్లు ఫ్రాన్స్‌కు వచ్చానని.. కానీ ఈసారి నా పర్యటన ప్రత్యేకమైనదని మోదీ వివరించారు.తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌లో అడుగు పెట్టిన వెంటనే ఆయనకు మిలిటరీ స్థాయిలో స్వాగతం లభించింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు ఆయన సతీమణి మోదీని ఆహ్వానించారు. స్పెషల్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. డిన్నర్‌కి ముందు ప్రధాని మోదీ అక్కడి ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ తరవాత ఫ్రాన్స్‌తో UPI డీల్ ప్రకటించారు. అంటే…ఇకపై ఫ్రాన్స్‌లోనూ UPI చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ఇండియన్ టూరిస్ట్‌లు ఇకపై UPI చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు మోదీ. ఆయన ప్రసంగిస్తుండగా అక్కడి ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.
PM @narendramodi arrived in Paris a short while ago.
He was warmly received by PM @Elisabeth_Borne at the airport.
The PM was accorded a ceremonial welcome upon his arrival. pic.twitter.com/2eCzp2Pjyw
— PMO India (@PMOIndia) July 13, 2023
Also Read: Chandrayaan 3 Launch: చంద్రుడి మీద చేసిన తొలి ప్రయోగంలో ఇస్రో గ్రాండ్ సక్సెస్ – రెండోది ఎక్కడ ఫెయిల్ అయింది?