టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ…
రాజాసింగ్ రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన… శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు. అయితే రాజాసింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగుదేశంతో కావటం ఆసక్తికరం. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన… 2014, 2018లో మంగళ్‌హాట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు.