ByGanesh
Sat 15th Jul 2023 11:25 AM
రిపబ్లిక్ సక్సెస్ తర్వాత విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టి.. కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ త్వరలోనే మేనమావ పవన్ కళ్యాణ్ తో కలిసి BRO మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. క్రేజీ మూవీగా కనబడుతున్న BRO తో కూడా సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తాడని మెగా ఫాన్స్ ధీమాని వ్యక్తం చేస్తుండగా.. ప్రస్తుతం సాయి ధరమ్ BRO ప్రమోషన్స్ మొదలుపెట్టేసాడు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఆయన స్వామి వారిని దర్శించుకుని సుబ్రమణ్యేశ్వర స్వామికి స్వయంగా హారతి ఇవ్వడంపై వివాదం మొదలయ్యింది. ఆలయ నియమాల ప్రకారం అక్కడి ఆలయ అర్చకులు మాత్రమే స్వామివారికి హారతివ్వాలి. ఇలా ఎవరు బడితే వారు హారతి ఇవ్వకూడదు అంటూ భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పూజారులు తప్ప మరి ఎవ్వరు హారతి ఇవ్వకూడదు అంటూ భక్తులు ఆగ్రహాం. ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Devotees Are Angry About Offering Sai Dharam Tej Aarti :
Devotees Are Angry About Offering Sai Dharam Tej Aarti in Srikalahasti Temple