ByGanesh
Wed 28th Feb 2024 03:45 PM
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఈ తార పేరు తెలియని వారుండరు. ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ, రకరకాల మోడ్రెన్ డ్రెస్సులు, సారీస్ తో ఒంపులు చూపించే అనసూయ భరద్వాజ్ ఈమధ్యన ఏక్కువగా సాంప్రదాయ లుక్ లోనే కనిపిస్తుంది. సారీస్ లో అందులోను పట్టు చీరల్లో మెరిసిపోతుంది. ఎక్కువగా మోడ్రెన్ లుక్ నే ఇష్టపడే అనసూయ షాప్ ఓపినింగ్స్ కి వెళుతూ పట్టు చీరలని ప్రమోట్ చేస్తుంది.
ఇక మార్నింగ్ వాక్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసే క్షణాలతో పాటుగా భర్త భరద్వాజ్ తో చేసే రోజువారీ వర్కౌట్ విషయాలని పంచుకునే అనసూయ తాజాగా గ్లామర్ డ్రెస్ తో మత్తెక్కించింది. అలా అనసూయని చూస్తే మైండ్ కాసేపు పని చెయ్యదు. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అన్నట్టుగా అనసూయ అందాలు చూపించేసింది. నాలుగు పదుల వయసులోనూ అనసూయ ఈ రేంజ్ అందాలు చూపిస్తుంటే యూత్ కి నిద్రేలా పడుతుంది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్స్ తో అలాగే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది అనసూయ.
ఫ్యామిలీ కోసమే అనసూయ బుల్లితెర షోస్ ముఖ్యంగా జబర్దస్త్ ని వదిలేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే అనసూయ కనబడుతుంది. సోషల్ మీడియాలోనూ ఆమె జోరు ఏ మాత్రం తగ్గలేదు.
The mind is blank when you see Anasuya beauty:
Anasuya Bharadwaj Latest Pics Goes Viral