ByGanesh
Fri 01st Mar 2024 10:27 AM
సంక్రాంతి సినిమాలన్ని ఓటిటిల్లోకి వచ్చేశాయి. వాటి సందడి సద్దుమణిగింది. కానీ సంక్రాంతికి పెద్ద హిట్ గా నిలిచిన హనుమాన్ జాడ మాత్రం కనిపించడం లేదు. ఇంతవరకు ఓటిటి డేట్ లాక్ చెయ్యకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంకా ఇంకా వెయిట్ చేయిస్తూనే ఉన్నారు హనుమాన్ మేకర్స్. హనుమాన్ ఓటిటి హక్కులని దక్కించుకున్న జీ 5 హనుమాన్ ని ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందా అని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
హనుమాన్ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కూడా హనుమాన్ మ్యానియా నుంచి బయటికొస్తున్నారు. ప్రశాంత్ వర్మ తదుపరి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనులు మొదలు పెట్టేసాడు. అటు తేజ సజ్జ నెక్స్ట్ మూవీ కోసం ఫోటో షూట్స్ వదులుతున్నాడు. మరి ఇంత జరుగుతున్నా హనుమాన్ ఓటిటి రిలీజ్ ఎప్పుడో చెప్పడం లేదు. మార్చ్ 2 నుంచి హనుమాన్ ఓటిటిలో కనిపిస్తుంది అని ప్రచారం జరిగింది.. ఆ మార్చ్ 2 రేపే. కానీ హనుమాన్ పై ఎలాంటి అప్ డేట్ లేదు.
ఈ లెక్కన హనుమాన్ మార్చ్ 8 న ఏమైనా ఓటిటీ రిలీజ్ చేశారేమో అంటూ ఆలోచిస్తున్నారు. మరి మార్చ్ రెండో వారంలో అయిన హనుమాన్ రాక ఉంటుందో.. లేదంటే ఇంకా వెయిట్ చేయిస్తారో చూడాలి.
Hanuman OTT Release Date suspense continue:
Hanuman May Land On OTT On This Date