అమెరికాలో మరో భారతీయుడు మృతి, యూపీకి చెందిన సిక్కుపై దుండగుల కాల్పులు

<p><strong>UP Man Killed in US: </strong>అమెరికాలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్&zwnj;కి చెందిన సిక్కుని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని కీర్తన్ గ్రూప్&zwnj;లో పని చేస్తున్న మ్యుజీషియన్ రాజ్ సింగ్ అలియాస్ గోల్డీపై అలబామాలోని గురుద్వారా వద్ద కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నరగా అమెరికాలోనే ఉంటున్న రాజ్&zwnj;సింగ్ గురుద్వారాలో కీర్తనలు పాడేందుకు వెళ్లాడు. ఈ కార్యక్రమం ముగిసిన తరవాత గురుద్వారా నుంచి బయటకు వచ్చాడు. రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న రాజ్&zwnj;సింగ్ మృతిపై బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్&zwnj;సింగ్ కూడా చనిపోవడం కుటుంబ సభ్యుల్ని కలిచి వేసింది. వీలైనంత త్వరగా అతని మృతదేహాన్ని భారత్&zwnj;కి రప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు.&nbsp;<strong><br /></strong></p>

Source link