Tomato Prices Centre’s Big Move Amid Soaring Tomato Prices Rate Reduced To Rs 80 In Delhi | Tomato Prices: సబ్సిడీ ధరకే టమాటా విక్రయాలు, కిలో రూ.80 మాత్రమే

Tomato Prices: 

ఢిల్లీలో సబ్సిడీ..

దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండి పోతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలూ కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వాలో జోక్యం చేసుకుని తక్కువ ధరలకు టమాటాలు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలో పలు చోట్ల రేషన్‌ దుకాణాల్లో టమాటాలు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనూ టమాటా ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నోయిడా, లఖ్‌నవూ, కాన్‌పూర్, వారణాసి,పట్నా, ముజఫర్‌పూర్‌ ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80కే విక్రయించనుంది. దేశంలో దాదాపు 500 కేంద్రాల్లో ధరల స్థితిగతుల్ని తెలుసుకున్నాక..ఈ నిర్ణయం తీసుకున్నట్టు National Cooperative Consumers’ Federation of India అధికారులు వెల్లడించారు. ఇవాళ్టి నుంచే (జులై 16) ఈ ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. 

“దేశవ్యాప్తంగా దాదాపు 500 కేంద్రాల్లో టమాటా ధరలెలా ఉన్నాయో అసెస్ చేశాం. ఆ తరవాత ఢిల్లీలో రూ.80కే కిలో టమాటా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఢిల్లీ, నోయిడా, లఖ్‌నవూ, కాన్‌పూర్, వారణాసితో పాటు పలు ప్రాంతాల్లో ఈ ధరకే టమాటా విక్రయాలు ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లో ధరల్ని బట్టి ఈ స్కీమ్‌ని మరి కొన్ని ప్రాంతాలకూ విస్తరించాలని చూస్తున్నాం. సబ్సిడీ ప్రకారం ఢిల్లీ NCR ప్రాంతాల్లో పలు చోట్ల రూ.80కే టమాటాలు విక్రయిస్తాం. మొబైల్ వ్యాన్స్‌ ద్వారా అమ్మకాలు జరుగుతాయి”

– కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీలో దాదాపు 100 కేంద్రీయ భండార్ అవుట్‌లెట్స్‌ తెరిచేందుకు కోఆపరేటివ్ కన్‌జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.178గా ఉంది. ముంబయిలో రూ.150, చెన్నైలో రూ.132. దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లలో టమాటా ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. గరిష్ఠంగా రూ.250కి చేరుకుంది. యావరేజ్ ప్రైస్ మాత్రం రూ.117గా ఉన్నట్టు తేలింది. 

లక్షాధికారులు అవుతున్న రైతులు..

పుణే జిల్లాకి చెందిన తుకారాం భాగోజీ గయాకర్ (Tukaram Bhagoji Gayakar) టమాటాలు పండించి జాక్‌పాట్ కొట్టాడు. ఉన్నట్టుండి వాటి ధర ఆకాశాన్నంటింది. ఇంకేముంది వెంటవెంటనే వాటిని తీసుకొచ్చి మార్కెట్‌లో పోశాడు. అన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. నెల రోజుల్లో దాదాపు 13 వేల కేసుల టమాటాలు విక్రయించాడు. ఇలా రూ.1.5కోట్లు సంపాదించాడు తుకారామ్‌కి 18 ఎకరాల పొలం ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటానే పండించాడు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వీటిని సాగు చేసింది తుకారామ్ కుటుంబం. ఏయే ఫర్టిలైజర్‌లు వాడాలి..? ఏ మందులు వాడితే పురుగు రాకుండా ఉంటుంది..? అని చిన్నపాటి రీసెర్చ్ చేసి మరీ సాగు చేశారు. అలా సాగు చేయగా వచ్చిన టమాటాలను మార్కెట్‌కి తరలించే ముందు క్రేట్స్‌లో (Tomato Crates) సర్దుతారు. రోజుకి ఒకటి చొప్పున అమ్మి రూ.2,100 సంపాదించారు. ఈ మధ్యే ఒకే రోజు అత్యధికంగా 900 క్రేట్‌ల టమాటాలు అమ్మేశారు. అలా ఒక్క రోజులోనే రూ.18 లక్షలు సంపాదించుకున్నారు. క్వాలిటీని బట్టి ఒక్కో కేస్ రూ.1000 నుంచి రూ.2,400 వరకూ పలుకుతోంది. ఈ ఒక్క రైతే కాదు. పుణేలో జున్నార్‌ ప్రాంతంలో టమాటాలు పండించిన రైతులు కూడా లక్షాధికారులు అయిపోయారు.

Also Read: Reverse Ageing: వయసు తగ్గించుకునే మందు కనిపెట్టిన సైంటిస్ట్‌లు, రివర్స్ ఏజింగ్‌తో నిత్య యవ్వనం!

Source link