రాళ్ల దాడి
టీడీపీ నేత ఇంటిపై దాడి విషయం తెలుసుకుని ఆ పార్టీ శ్రేణులు అక్కడిక భారీగా చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణలో పోలీస్ జీపు, టీడీపీ నేతలు కడియాల రమేశ్, అరవిందబాబు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో అరవిందబాబు కారు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో… పోలీసులు రంగంలోకి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అతికష్టం మీది ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు.