Sun Orbiting Milkyway : How Long Sun Around Milky Way

Sun orbiting Milkyway : 
– మన గెలాక్సీ లో 400బిలియన్ నక్షత్రాలు
– అన్ని నక్షత్రాల్లో ఒకటి మన సూర్యుడు
– గ్రహాలన్నింటిని తనతో పాటే తిప్పుతున్న సూర్యుడు
– గంటకు 8లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యభ్రమణం
– గెలాక్సీని ఓ చుట్టు చుట్టిరావటానికి 25కోట్ల సంవత్సరాలు

ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి నక్షత్రమైన సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనినే భూ పరిభ్రమణం అంటారు. మరి సూర్యుడు దేని చుట్టూ తిరుగుతాడు. మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా. సూర్యుడు మన పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన మిల్కీ వే గెలాక్సీలో సూర్యుడి లాంటి నక్షత్రాలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. 
ఓ అంచనా ప్రకారం 400 బిలియన్ నక్షత్రాలు ఒక్క మన గెలాక్సీలోనే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారు. బిలియన్ అంటే వంద కోట్లు మరి 400 బిలియన్ అంటే అర్థం చేసుకోండి ఎన్ని నక్షత్రాలో. ఈ నక్షత్రాలు తమ పక్కనున్న నక్షత్రాల్లో కూలిపోకుండా ఉండేందుకు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 
అసలు మన పాలపుంతలో సూర్యుడు ఎక్కడుంటాడో తెలుసా. ఇదిగో ఇక్కడ ఉంటాడు. సూర్యుడు తిరగటం అంటే తన చుట్టూ తిరుగుతున్న భూమి సహా గ్రహాలు, వాటి చందమామలు, ఆస్ట్రాయిడ్స్ అన్నింటిని తన పాటే తిప్పేస్తూ ఉంటాడు. ఎంత స్పీడో తెలుసా. గంటకు 8 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మనకు తెలియటం లేదు కానీ మన భూమిని 8 లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుడు తిప్పుతున్నాడు అన్నమాట. ఇంత స్పీడ్ తో తిరిగినా మనం ఉన్న ఈ గెలాక్సీ ని పూర్తిగా ఓ రౌండ్ వేసి మళ్లీ ఇక్కడకు రావటానికి ఎంత టైమ్ పడుతుందో తెలుసా అచ్చంగా పాతిక కోట్ల సంవత్సరాలు. అంత పెద్దదన్న మాట మన గెలాక్సీ.  

సూర్యుడు అనే నక్షత్రం ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయ్యి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. సో ఇప్పటి వరకూ మనం ఉన్న గెలాక్సీని సూర్యుడు కేవలం 18 సార్లు మాత్రమే పూర్తిగా ప్రదక్షిణం చేశాడన్న మాట. దీన్నే కాస్మిక్ ఇయర్ అంటారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link