Nayanthara Poster in Jawan జవాన్ నుంచి నయన్ పోస్టర్


Mon 17th Jul 2023 04:24 PM

jawan  జవాన్ నుంచి నయన్ పోస్టర్


Nayanthara Poster in Jawan జవాన్ నుంచి నయన్ పోస్టర్

ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు క్రియేట్ చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జ‌వాన్‌. షారుఖ్‌ఖాన్ – నయనతార జంటగా కనిపిస్తుండగా.. దీపికా పదుకొనే గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్ గా జవాన్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. జ‌వాన్ నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుందా? అని ఆత్రుత‌తో ఎదురుచూస్తున్న అభిమానుల మ‌న‌సు తెలుసుకున్న మేక‌ర్స్ జవాన్ నుంచి నయనతార కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. చూడ‌గానే స్ట‌న్నింగ్‌గా, యాక్ష‌న్ ప్యాక్డ్ అవ‌తార్‌లో మెప్పిస్తున్నారు న‌య‌న‌తార‌. జ‌వాన్ హీరోయిన్ న‌య‌న‌తార లుక్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. 

ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మ‌రో రేంజ్‌లో ఉండి తీరుతుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఈ పోస్ట‌ర్ వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ అయింది. షారుఖ్ ఇచ్చిన ట్రీట్ సూప‌ర్‌డూప‌ర్ అంటున్నారు ఫ్యాన్స్. 

సౌత్ ఇండియాలో త‌లైవిగా, లేడీ సూప‌ర్‌స్టార్‌గా మెప్పించిన న‌య‌న‌తార‌కు బాలీవుడ్‌లో ఇది తొలి సినిమా. ప్ర‌ప్ర‌థ‌మంగా ఆమె ఉత్త‌రాదిన చేస్తున్న సినిమా కోసం అక్క‌డివారు కూడా ఎదురుచూస్తున్నారు. మొట్ట‌మొద‌టి సారి. వారిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూడ‌టానికి వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు మూవీగోయ‌ర్స్. 

జ‌వాన్ ప్రివ్యూలో న‌య‌న‌తార‌ను చూసిన వారు వావ్ అంటున్నారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఆమె పాత్ర డిజైన్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు. న‌య‌న‌తార ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ఆమె కేర‌క్ట‌ర్ సినిమాలో అత్య‌ద్భుతంగా హైలైట్ అవుతుంద‌నే విష‌యంలో అస‌లు అనుమానాలేం అక్క‌ర్లేదు.


Nayanthara Poster in Jawan:

Jawan new poster 





Source link