Pilli Vs Chelluboyina : కోనసీమ జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. దీంతో సొంత పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తున్నాయి. రామచంద్రాపురం వైసీపీ ఇదేవిధంగా వర్గపోరు మొదలైంది. మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రికి వ్యతిరేకంగా పిల్లి సుభాష్ వర్గం సమావేశాలు నిర్వహిస్తోందని సమాచారం. మంత్రి చెల్లుబోయినకు టికెట్ ఇస్తే ఓడిస్తామని మరో వర్గం బహిరంగంగానే ప్రకటనలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కొడుక్కి ఇప్పించాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తున్నారు. ఈ సీటును వదులుకునేందుకు మంత్రి వేణుగోపాల కృష్ణ సుముఖంగా లేరని సమాచారం. దీంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు.