Hyderabad To Ayodhya Flight Services : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు(Hyderabad to Ayodhya Flights) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజులు(మంగళ, గురు, శనివారాలు) విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అయోధ్యలోని శ్రీరాముడి దర్శనానికి(Ayodhya Ram mandir) వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన జ్యోతిరాదిత్య సింధియా… హైదరాబాద్, అయోధ్య మధ్య విమానాల రాకపోకల కోసం కమర్షియల్ ఎయిర్లైన్స్(Airlines) తో మాట్లాడారు. ఇకపై హైదరాబాద్, అయోధ్య మధ్యలో డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడ్రోజుల చొప్పున మంగళవారం, గురువారం, శనివారం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.