వ్యాపారులను బెదిరించారనే ఆరోపణలు
పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనం అయింది. సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో అభియోగించారు. దీంతో పాటు ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ సర్టిఫికేట్లు జారీ చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ లేఖలు, ధృవపత్రాలు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణకు ఆదేశించామని ప్రభుత్వం తెలిపింది.