ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్
రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాపై చర్చ కోసం సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామమైనా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమని రేవంత్ తెలిపారు. విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఉచిత కరెంట్ అంశాన్ని ప్రజల సెంటిమెంట్‌గా మారుస్తూ స్వార్థం కోసం సీఎం కేసీఆర్ వాడుకుంటున్నారని తానా సభల్లో తాను చెప్పినట్లుగా రేవంత్ అన్నారు. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని ఆరోపించారు. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వలేదని మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో 30 శాతం కమీషన్లు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.