జబర్దస్త్ వదిలేశాక డిప్రెషన్ లోకి వెళ్ళాను


Mon 17th Jul 2023 08:19 PM

venu yeldandi  జబర్దస్త్ వదిలేశాక డిప్రెషన్ లోకి వెళ్ళాను


I went into depression after Jabardasth జబర్దస్త్ వదిలేశాక డిప్రెషన్ లోకి వెళ్ళాను

ఈటీవీలో కామెడీ షో జబర్దస్త్ మొదలైనప్పుడు వేణు, ధనరాజ్ లాంటి కమెడియన్స్ టీమ్స్ గా ఫామ్ అయ్యి కామెడీ స్కిట్స్ చేస్తూ తెగ ఫేమస్ అయ్యాడు వెండితెర మీదకన్నా బుల్లితెర జబర్దస్త్ ద్వారానే ప్రేక్షకుల మైండ్ లో సెటిల్ అయ్యారు. సరదాగా స్కిట్స్ చేస్తూ కామెడీతో నవ్విస్తూ రెండు చేతులా సంపాదించారు. అయితే జబర్దస్త్ మొదలైనప్పటినుండి ఉన్న వేణు టిల్లు, ధన ధనరాజ్ లాంటి వాళ్లంతా వెళ్లిపోయారు. ఆ తర్వాత సుధీర్, ఆది, శ్రీను లాంటి వాళ్ళు వచ్చారు. అప్పటినుండి మళ్ళీ జబర్దస్త్ లో వేణు, ధనరాజ్ వాళ్ళు కనిపించలేదు.

అయితే జబర్దస్త్ వదిలేశాక కొన్నేళ్లపాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న వేణు టిల్లు బలగం సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తాడు. బలగంతో బలమైన పునాది వేసి ఇండస్ట్రీలో దర్శకుడిగా సత్తా చాటారు. ఒక్క సినిమాతో 100 అవార్డులని కొల్లగొట్టాడు. తాజాగా వేణు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. తాను 1999 లో 200 రూపాయలతో హైదరాబాద్ కి వచ్చాను, ఎన్ని కష్టాలు ఎదురైనా ఏకాగ్రత కోల్పోలేదు, సినిమాలు చేయాలనేదే నా ఏకైక లక్ష్యం. చూడడానికి బాబు మోహన్ లా ఉంటావ్ అనడంతో కమెడియన్ అయ్యాను.

సినిమాలు చేస్తూ జబర్దస్త్ కామెడీ షోకి వెళ్ళాను. జబర్దస్త్ వదిలేసాక చాలా రోజులు ఖాళీగానే ఉన్నాను. సినిమా అవకాశాలు రాలేదు. దానితో డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఆ తర్వాత సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. అలా పుట్టిందే ఈ బలగం కథ అంటూ వేణు చెప్పుకొచ్చాడు. మా నాన్న చనిపోయినప్పుడు సరైన సమయం లేక అచారాలన్నీ పాటించలేకపోయాను.. బలగం కథ రాస్తున్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయి అంటూ వేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


I went into depression after Jabardasth:

Venu Yeldandi Interview





Source link