అసలేం జరిగింది?
బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులు, ఇతర మావోయిస్టులు మిలీషియా సభ్యులు లక్ష్యంగా చేసుకుని అక్రమంగా సమావేశమవుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. 2022 ఆగస్టు 19న ప్రభుత్వ అధికారులు, అమాయక పౌరులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువకులను రిక్రూట్మెంట్ చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ సీపీఐ మావోయిస్టులకు నిధుల సేకరణ చేస్తున్నారని తెలుసుకుని ములుగు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. కూంబింగ్ ఆపరేషన్ సమయంలో, నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన కొందరు ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో ఉండడాన్ని పోలీసులు గమనించారు. వారిని లొంగిపోవాలని పోలీసులు కోరారు. అయితే వారు తమ గుడారాన్ని ఖాళీ చేసి అక్కడి నుంచి దట్టమైన అడవిలోకి పారిపోయారు. అనంతరం సీపీఐ మావోయిస్టు పార్టీ సమావేశ స్థలాన్ని గుర్తించిన పోలీసు బృందం, ఒక టెంట్లో మావోస్టులు సామాగ్రిని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 152/2022 u/s 120b, 147, 1013, 18, 20, 38 లో UAPA కేసు, JAPA చట్టం, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25(1-B)(a) PS తాడ్వాయి, ములుగులో 152 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన మావోయిస్టు నాయకులు, వారి సానుభూతిపరులు, మావోయిస్టులో పేర్లు ఉన్న ఇతర వ్యక్తులు ఉన్నారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసిన తరువాత, ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవడానికి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టారు. విచారణలో కేసుకు సంబంధించిన వాస్తవాలతో పరిచయం ఉన్న సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు.