ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ తమ కూటమికి కొత్త అర్థం చెప్పారు. NDA లో ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆస్పిరేషన్ అని ప్రధాని మోదీ అన్నారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీలో వారి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నందున తాజాగా మోదీ ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
#WATCH | “NDA means N=New India, D=Development, A=Aspiration,” says Prime Minister Narendra Modi while addressing NDA Meeting in Delhi pic.twitter.com/EjeCeIdXVI
— ANI (@ANI) July 18, 2023
అలాగే ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలకు తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ చెప్పారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏనే కీలక పాత్ర పోషించిందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని అన్నారు.
ఎన్డీయే కూటమి అనేది మహాత్మా గాంధీ, అంబేడ్కర్, రామ్‌మనోహర్ లోహియా పిలుపునిచ్చిన మార్గంలో వెళ్తోందని మోదీ చెప్పారు. ఓటర్ల తెలివితేటలను ప్రతిపక్షాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది ఏనాడూ శత్రుత్వంగా మారకూడదని చెప్పారు. కానీ, ప్రస్తుత ప్రతిపక్షం మాత్రం అధికారంలో ఉన్న వారిని తరచూ తిట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సానుకూలంగా రాజకీయాలు చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
–
ప్రపంచ దేశాలు కూడా 2024లో మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాయని అన్నారు. అమెరికా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాలు ఎన్డీఏ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయని చెప్పారు.