ఇన్ని బైకులు ఎందుకు అంటూ సాక్షి కూడా ధోనీని అడుగుతుంది. దీనికి ధోనీ సరదాగా సమాధానమిచ్చాడు. “ఎందుకంటే నువ్వు నా నుంచి అన్నీ తీసేసుకున్నావు. నాకంటూ ఒకటి ఉండాలని అనుకున్నాను. నువ్వు దీనికి మాత్రమే అనుమతి ఇచ్చావు” అని ధోనీ అనడం విశేషం. ధోనీ బైక్స్ కలెక్షన్ లో రాజ్‌దూత్, కవాసకీ నింజా, హార్లీ డేవిడ్‌సన్, టీవీఎస్ రోనిన్ క్రూజర్ లాంటి కంపెనీల బైకులు ఉన్నాయి.