రేవంత్ రెడ్డివి చిల్లర రాజకీయాలు
“ట్రాన్స్‌జెండర్ల వర్గాన్ని, వివిధ బీసీలను అవమానించేలా రేవంత్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు సహిస్తుంది. రాజకీయ సంస్కృతిని నాశనం చేసే రాబందుగా రేవంత్ రెడ్డి మారిన విషయాన్ని ఏఐసీసీ ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు నియంత్రిచడం లేదు? చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం కాంగ్రెస్ కొత్త ఆచారమా? సీఎం కేసీఆర్ పాలనలో సమాజంలోని ప్రతి వర్గం ఎంతో గౌరవంగా ఉంది. ఎలాంటి కులం, మతం, లింగం విభేదాలు , వివక్షత లేకుండా కేసీఆర్ గౌరవిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాలను వైద్యులుగా నియమించి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని గౌరవించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాల కోసం ట్రాన్సజెండర్ సమాజాన్ని, దొమ్మర, వంశరాజులు, యాదవులు, గౌడలు మొదలైన వారితో సహా సమాజంలోని ఇతర పేద వర్గాలను అవమానిస్తూ తక్కువ స్థాయికి దిగజార్చుతున్నారు. రేవంత్ నోటికి అడ్డు అదుపులేదు. అవతలి వ్యక్తులను , వారి వయసును , వారి కులాలను ఏమాత్రం లెక్కచేయకుండా అవమానిస్తున్నారు.”- దాసోజు శ్రవణ్