Who is Bigg Boss Telugu Season 7 Host? ఇంతకీ బిగ్‌బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు?


Wed 19th Jul 2023 12:00 AM

bigg boss,telugu season 7,host,nagarjuna,balakrishna,rana  ఇంతకీ బిగ్‌బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు?


Who is Bigg Boss Telugu Season 7 Host? ఇంతకీ బిగ్‌బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు?

తెలుగు బుల్లితెరపై సందడి చేయడానికి బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 7 సిద్ధమవుతోంది. ఈసారి బిగ్ బాస్ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజీయస్‌గా తీసుకుంటున్నారనేలా వార్తలు వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే వారందరి విషయంలో టీమ్ చాలా కేరింగ్ ఉంటుందని, మరీ ముఖ్యంగా కాస్త పేరున్న వారినే హౌస్‌లోకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అయితే టాక్ వినబడుతోంది. ఎందుకంటే.. హిందీ, తమిళ్‌‌లో బిగ్‌బాస్ మంచి రేటింగ్‌ను సొంతం చేసుకుంటుంటే.. తెలుగులో మాత్రం గత రెండు మూడు సీజన్స్‌గా బిగ్‌ బాస్ దారుణంగా పడిపోయింది. 

ఈ షోని మళ్లీ నిలబెట్టాలంటే మంచి కంటెస్టెంట్స్ వల్లే అవుతుందని భావించిన టీమ్.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే వారికి అధిక మొత్తంలో ముట్టజెప్పడానికి కూడా సిద్ధమైంది. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడే కొందరు సోషల్ మీడియా టీమ్స్‌ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. అంతకు ముందులా క్వారంటైన్ లాంటివి లేవు కాబట్టి.. ఇప్పటికే హౌస్‌లోకి వెళ్లే వారికి ఓ క్లారిటీ రావడంతో.. హౌస్‌లోకి అడుగుపెట్టే ముందే సోషల్ మీడియాలో స్ట్రాంగ్‌గా ఉండేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. 

సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఈసారి హోస్ట్ ఎవరనేది ఇంత వరకు రివీల్ కాలేదు. ఎందుకంటే, బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి హోస్ట్‌ని మార్చాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా ఇప్పటికే బోలెడన్నీ రకాలుగా వార్తలు వచ్చాయి. అదే నిజమైతే మాత్రం ఈ సీజన్ నాగార్జునకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్లేస్‌లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కడం, మరోవైపు రెండు సినిమాలు చేస్తుండటంతో బాలయ్య ఉన్న బిజీకి బిగ్ బాస్ సెట్ కాదని అనుకుంటున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. రానా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు హోస్ట్ మారడం లేదని, నాగార్జునే ఈ సీజన్‌‌ను కూడా నడిపిస్తారనేలా టాక్ వినబడుతోంది. చూద్దాం మరి.. పైనల్‌గా సీజన్ 7 హోస్ట్ ఎవరో..?


Who is Bigg Boss Telugu Season 7 Host?:

Bigg Boss Telugu Season 7 Host Nagarjuna Or Balakrishna Or Rana Daggubati 





Source link