నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి-ts ap weather orange alert to telangana districts ap heat wave mandals list ,తెలంగాణ న్యూస్

TS AP Weather : తెలుగు రాష్ట్రాల్లో(TS AP Weather) ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలో 9 జిల్లాలకు సోమవారం(ఏప్రిల్ 29న)వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert)జారీ చేసింది. కరీంనగర్, నల్గొండ, ములుగు, జగిత్యాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో వడదెబ్బ(Sunstroke)తో ఆదివారం ఒకరు మృతి చెందారు.

వచ్చే 5 రోజులు

వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ(TS Heat Wave)లో వేడి, తేమ వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ (Hyderabad)వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం నల్గొండ(Nalgonda) జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.3 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌ లో 45.2 డిగ్రీలు, భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరిలో 45.2 డిగ్రీలు, ములుగు జిల్లా ధర్మవరంలో 45.2, నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 45.1 డిగ్రీలు, ములుగు జిల్లా అలుబాకలో 45.1 డిగ్రీలు, వనపర్తి జిల్లా పాన్గల్‌లో 45.1 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాటూర్‌ లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఈ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం

సోమవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాలలో వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఏపీలో తీవ్ర వడగాల్పులు

ఏపీలో ఎండలు(AP Heat Wave) మండిపోతున్నాయి. రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 29న) 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Severe Heat Wave),151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే ఈరోజు 68 మండలాల్లో తీవ్రవడగాల్పులు,120 మండలాల్లో వడగాల్పులు వీచాయని వెల్లడించింది. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.ఎండదెబ్బ(Sunstroke) తగలకుండా టోపీ,గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇవాళ నంద్యాలలో 45.6 డిగ్రీలు, కర్నూలులో 45.2 డిగ్రీలు, అనంతపురం 44.1 డిగ్రీలు, కడప 43.6 డిగ్రీలు, తిరుపతి 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Source link