Konaseema Accident: కోనసీమ Konaseema జిల్లాలోని అమలాపురం Amalapuram రూరల్ మండలం భట్నవిల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి దగ్గర లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. – మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
యానాం Yanam లో పుట్టిన రోజు వేడుకలు( birthday Celebratoins) పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మృతులను నవీన్(22), జతిన్(26), నల్లి నవీన్(27), అజయ్(18)గా గుర్తించారు. మృతులు మామిడికుదురు మండలం నగరం వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని కోనసీమ జిల్లా నగరం గ్రామ వాసులు, ఒకరిని పి.గన్నవరం మండలం మానేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.
మద్యం మత్తులోనే..
మద్యం మత్తులో ఆటోను వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి వేడుకలు జరుపుకున్నారు .
అర్థరాత్రి వరకుమద్యం సేవించిన యువకులు అనంతరం స్వగ్రామానికి ఆటో బయలుదేరారు. సరిగ్గా రాత్రి 12.30 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శ్రీ వనువులమ్మ గుడి ఎదురుగా NH216 రోడ్ పై అమలాపురం నుండి ముమ్మిడివరం వైపు వెళ్ళుచున్న AP39UM 7757 చేపల లారీ ఢీ కొట్టారు.
ఈ ఆటోలో ప్రయాణిస్తున్న 4 గురు యువకులు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు.చనిపోయిన వారిలో మానేపల్లి గ్రామానికి చెందిన యువకుడు వున్నాడు.తీవ్ర గాయాలు అయిన నలుగుర్ని పోలీసులు కిమ్స్ కు తరలించారు. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు సంఘటన స్థాలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆటోను మితిమీరిన వేగంతో నడపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.