ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..-ap model school entrance exam marks are here check online like this ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP Model School Marks: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ  పాఠశాలల్లో Model Schools ప్రవేశాల కోసం నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షల Results ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ School Education విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన 31,376 విద్యార్థుల మార్కులను School education విద్యాశాఖ కమిషనర్‌ విడుదల చేయడం జరిగినది. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల తల్లి తండ్రులంతా ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవైబ్‌సైట్ల నుంచి ఫలితాలను పొందవచ్చని తెలిపారు. https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్లలో మార్కుల్ని అందుబాటులో ఉంచారు.

విద్యార్ధులు సాధించిన మార్కుల్ని విద్యార్థి హాల్ టికెట్ ద్వారా మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు ఎంచుకున్న మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్ కోసం అయా మోడల్ స్కూల్స్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి అడ్మిషన్ల Admissions కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహించారు.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ 21 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ప్రవేశ ఆరోతరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో నిర్వహించారు. తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో పరీక్షను రాసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 31, 376మంది హాజరయ్యారు. విద్యార్ధులు సాధించిన మార్కుల ఆధారంగా వారు ఎంచుకున్న పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

Source link