జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి(TS SSC) సప్లమెంటరీ పరీక్షల్ని(TS Supplementary Exams 2024) జూన్ 3 నుంచి జూన్ 13వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షల్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు గడువు తక్కువగా ఉన్నందున 2024 మార్చిలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ కౌంటింగ్(Recounting), రీ వెరిఫికేషన్(Reverification) పలితాలతో సంబంధం లేకుండా జూన్‌లో జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ పదో తరగతి పరీక్షల రీకౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోగా మే15వ తేదీలోగా ఎస్‌బీఐ బ్యాంకులో హెడ్‌ఆఫ్ అకౌంట్ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 0202 ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ కల్చర్, 01 జనరల్ ఎడ్యుకేషన్, 102 సెకండరీ ఎడ్యుకేషన్, 06 డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, 800 యూజర్ ఛార్జెస్ హెడ్ అకౌంట్లకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.