Sudheer & Getup Srinu Campaigning For Janasena జనసేన ప్రచారంలో సుడిగాలి సుధీర్

నిన్నటివరకు జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం పిఠాపురంలోనే కనిపించారు. హైపర్ ఆది దగ్గర నుంచి గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ వాళ్ళ టీం మెంబెర్స్ అంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలోకి దిగారు. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఏదో ఆశించి మాత్రం పవన్ కి సపోర్ట్ గా ప్రచారం చెయ్యడానికి రాలేదు. 

కేవలం పవన్ కళ్యాణ్, నాగబాబు మీదున్న అభిమానంతోనే వారంతా ఇంటింటికి తిరిగి పవన్ తో పాటుగా ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించమని అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కమెడియన్ కమ్ హీరో సుధీర్ కూడా జనసేన ప్రచారంలో జాయిన్ అయ్యాడు. పిఠాపురంలో సుధీర్ గెటప్ శ్రీను తో కలిసి ప్రచారం చేస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారంటే మాకెంతో అభిమానం, కామెడీ చెయ్యకముందు నుంచే ఆ హీరోలంటే ఇష్టం. మేము స్టార్స్ గా ఇక్కడికి రాలేదు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే వచ్చాము. ఆ అభిమానంతోనే పిఠాపురంలో జనసేనని గెలిపించమని ప్రచారం చేస్తూ పని చేస్తున్నాము అంటూ సుగిగాలి సుధీర్ మీడియాకి వివరించాడు. 

హైపర్ ఆది రాజోలులో ప్రచారం చేస్తూ.. సమస్యలు తీరాలంటే దేవ వరప్రసాద్ గారికి ఓటు వెయ్యండి.. కొత్త సమస్యలు రావాలంటే గొల్లపల్లికి వెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. 

Source link